ఆమని అందాలు జలజల సాగే జల పాతాలు మనసును మరులు గొలిపించు తేలి మంచు సోయగాలు
పరువాల పల్లె పడుచు పరికిణి లాంటి ప్రకృతి పచ్చదనాలు
పాల ధారా వోలే గంగ శివాభిషేకానికై తపియించు తలపులు
కళల కావ్యాo లా కదలి సాగే కమనీయ పిల్ల కాలువలు
కన్నుల విందుచేసే వర్ణించ లేని కావ్యాలు
వీచే గాలి గంధాలు పూచెపుల పరిమళాలు
పరచిన తివచీల పచ్చ దనాలు
ప్రియుని పిలుపులా తీయటి గాలుల గానాలు
చిగురుటాకుల చమరింతలు
కొండల కొనల కోకిల గానాలు
కడతేరిపోవాలి నా జీవితం ఇక్కడే ఇప్పుడే
-కళావాణి-
No comments:
Post a Comment