యమునా తీరం రమ్యమైన తివాచి పరిచినది
యదాయధాలు గ సుమములు సుగంధ పరిమళాలు వెదజల్లినది
యాచించే కృష్ణయ్యను రాధ యుగాలు నిలిచే ప్రేమ కావాలని
యోచించకనే క్రిష్నయ్య తధాస్తు పలికే ప్రేమనివ్వగాలనని
యదార్థమే కదా రాధామాధవుల ప్రణయం
యుక్త మై నిలచియుండును ప్రాణమై
యవ్వని జవ్వని రాధ రాగానే
యదను పరిచే బృందావని పులచే
ఎల్లలు లేనిది గోపెమ్మల ప్రేమ
యశస్సు తో వెలిగే గొపీ మనోహరుడు
యదలో నీ సొదలన్నీ గానమై ఆలపించే
యాగమై ధ్యనమై మనసు రమించె
యందేందు వెదకినా కన్నులందే కన్నయ్య నిలచె
యెమాయె ఈవేళ మనసు కొలతమేటించే
యుగాలదా ఈ బంధం నను మైమరపించే
యక్షులు గంధర్వులు ఈ మధుర గట్టని కని ధన్యత నొందిరి
-కళావాణి-
No comments:
Post a Comment