Monday, 25 August 2014

మరుగేల మాధవా

నీలి గగనంలో చందమామా
నీలమోహనునికి నీవైనా తెలుపుమా
నీ గానాలలో  తేలేము
నీ ధ్యానమే చేసేము
నీ జత లేక విరహించేము
నల్లనయ్యా వెన్న దొంగా
దోబూచేలరా దొరవేనీవుగా
దరిచేరరారా జాగేలరా
దరహాసమే లేదు అధరాలపై
ద్విరేఫము పరిబ్రమించు పుష్పాలపై
సిరివెన్నెల విరిసింది
సింగారి నీకై వేచింది
మరుమల్లెలు పూచాయి
మతేక్కిస్తున్నాయి
మదన మనోహరా రావోయి  
మది ఆలపించి పాడేము
మృదంగద్వనులతో పిలిచేము
మృదుమధుర గానాలతో వలచేము 
మరుగేల మాధవా
నా మనసెల రావా
             -కళావాణి -







No comments:

Post a Comment