Thursday, 7 August 2014

నిండు పున్నమి వెన్నెల

నిండు పున్నమి వెన్నెలారబోసింది 
జుంటు తేనే తాగే గువ్వ గుసగుసలాడింది 
పుట్ట మీద పాలపిట్ట  పులకించి పాడింది 
చెట్టు మీది చిన్ని గువ్వలు గంతులేసి ఆడాయి 
నీటతెలుహంసల జంట వెన్నెల విహరించాయి 
పట్టపగలే సిరివెన్నెల సిందేసి ఆడింది 
పక్షులతో కొలువైన ప్రకృతెంతో మురిసింది
అందాల జాబిల్లి అందుతుందేమో అనేలా 
ఆవనిపై అందాలు అరబోసేనే ఇలా
వేల కన్నులు కావాలి వీక్షించడానికి 
వెలలేని సౌరభాలు ఇలా చిత్రించడానికి 
           -కాళావాణి-



No comments:

Post a Comment