దరిచేరరా దయచేసి
నీ చూపు సుడి
నా ప్రేమ సడి
నీ వెంటపడి
నా నిదుర చెడి
పల్లవించు పరువంలో
పులకరించు మురిపాలు
మధుమాస వేళల్లో
మరులోలికే ప్రేమలో
మరుమల్లె తోటలో
మనసైన నీకోసం
మాటుగా వేచేను
కురులు చెదరే
కన్నుల కాటుక కరిగే
నొసటన తిలకం జారే
నీరు సలసల కాగే
నిలువనీక నీకై వేగే
దాగుడుమూతలు మని
దరిచేరరా దయచేసి
-కళావాణి-
No comments:
Post a Comment