నీపై ధ్యానం నీ నామమే స్మరణం
నీకే నా జీవితం అర్పితం
తంబుర నాదాంబృతం
తాపసీ తమకం
దీపమై వెలుగు తేరా
దివి నేలే దీరా
మోహనాంగా నీ మోహన వేణుగానం
మొదలై ఇది తుదిలో నిలిచే వేదసారం
మీరా వల్లభం శ్రితజన రూపం
మీరా మనసు మీటె కృష్ణ గీతం
మీటే ప్రతి రాగం మాధవ స్మృతుల హారం
ఆగమంటే ఆగేనా ఆరాధనా ప్రవాహం
అంగాoగమున నిండే అనంతుని రూపం
మది మందిరాన కొలువై ఉన్నకృష్ణ తేజం
మాధవా అని పిలిచినంతనే ఎదుట నిలిచే గోవిందం
మనసు మాధవ మందిరం
మధురమాయే జీవితం
-కాళ్ళవాణి-
No comments:
Post a Comment