Wednesday, 6 August 2014

గోవర్ధన గిరిధరా







గొల్ల గోపన్నల సమేతా గోవర్ధన గిరిధరా
గోవుల్లు కాచేటి గోవిందా
గోవులు నీ గానామృతమును విని మేతమానే
గోధూళి వేళ గోవులన్నీ నీ వెంటే నడచేనే
గోప బాలురకు నీ మాటే వెదమాయెనె
గొల్ల స్నేహాల  నీ అల్లరి ఆటలు
గొల్ల గోపికల తో సరస సల్లాపాలు
గోమాతల శోకము తీర్చిన కాళి మర్ధనా
గోవర్ధన గిరిని నెత్తి వ్రేపల్లె ప్రజా రక్షకా
గొడవలాయె అత్త కోడళ్ళకు వెన్న దొంగా
గోకులానికినీవే అండ దండవుగా
గొప్పగా స్తుతించే ప్రపంచమెల్ల నీ రాజ్యన
గోపికా మానస సంచారి





No comments:

Post a Comment