కలువల కొలనులో కమలములు విచ్చినవి
కన్నయ్య రాకతో నా కన్నుల కలువలు విచ్చినవి
రాధను నేను నా రాదేయుదడితో రాగారాధన చేసేవేల
రాజీవుని మురళీ రవళి కి రాజీవములు విచ్చె నిలా
రాయి కైన చలనము కలుగు రాగాలాపనలో
రాజ హంసలు తలలూచి శృతి కలిపే రస కేళిలో
రయ్యన ఎగిరివచ్చి కాకి పురములు నాట్యమాడగ నిలచె
రమ్యమైన శారద రాతిరిలో రాజీవునిచెంత నా మనసు నిలిచే
No comments:
Post a Comment