నీవు ఏతేoచకున్న వేచిన వెతను విడమర్చి
నిన్నల్లో మొన్నల్లో వెన్నెల్లో తేనేర్చి
నన్ను వల్లనన్న నల్లనయ్యకయి కన్నీరొడ్చి
మల్లెకన్న తెల్లని మనసు నాది చూడు నీ మనసు చేర్చి
మబ్బుల్లో చూసా నిను పోల్చి
కొమ్మలకు కోయిలలకు చెప్పా నీను గూర్చి
కొండలు కోనలు నా స్థితి చూసి ఓదార్చే
పొన్నల పూల పొదరిల్లు నాకందించే గాలిలో గంధాలు చేర్చి
పక్షులు నాకయి వినిపించే సుస్వరాలు తన గొంతులో కుర్చీ
చల్లనమ్మి వచ్చి నల్లనయకై వేచి వేచి నిట్టూర్చి
చల్లగాలీ నీవయినా నా వెతను నల్లనయ్యకు చేర్చు
క్షణమైనా నిను వీడి ఉండలేనని మధురమయిన మాటలన్నీ కూర్చి
కళావాణి
No comments:
Post a Comment