Thursday, 21 August 2014

బృందావన సంచారా

యదుకులోత్తమా యమునా తీరాన గోపికల ఎదలో నీ లీల
యశొద తనయా ఎదురుచుపుల వేతను మరచి ఆడిన ఆనంద కేళి
యద యదలో దాగి ఎనలేని ఆనందాల తేలి తేలి
యమునా తీరాన నీ వేణుగాన రాగ సుధల తేలి తేలి
యల కోయిల రాగాల శృతులు కలిపి ఏవో లోకాల తేలి తేలి
యాదవా మాధవా మగువలమానసచోరా శృంగార రసకేళి
యుద్దమే చేయని యవరాజు రాజు రాజ్యం
యదార్థాల సారమైన గీతాబృతం
 యుగ యుగా లకు నీ గీతా సారమే శరణం
యే కాంతకైనా ఏకాంతాన నీ ప్రేమే స్మరణం
యేమని పొగడుదురా బృందావన సంచారా 
యే రీతి కీర్తింతునురా ముగాకర నగాకర
           ముకుందా మాధవా
              -కళావాణి-


No comments:

Post a Comment