మరులు గొలుపు నీ రూపు మరువగలనా
నా కన్నులనీ రూపు చెదరునా
నా మసున నీ గానం మరువగలనా
రాధికా నా రాగల మాలికా
రంగు లన్ని రంగరించిన రoగవల్లి కా
రా రమ్మని పిలిచే నీ చూపుల నన్నేలిక
రాగాల లోలుని కవ్వించే కావ్య నాయికా
చూపులు కలిసెను లోకము మరచెను
చుక్కలు పొడిచెను మక్కువ గొలిపెను
చక్కదనాన చెక్కిలి మెరిసేను
చమకు చమకుల ముక్కెర మెరిసేను
కమ్మని మన ప్రేమ కమనీయము కమనీయం
కలకాలం నిలుచును
-కళావాణి -
No comments:
Post a Comment