Saturday, 23 August 2014

ఒకే జత

పల్ల్లవించు పరువంలో
పులకరించు మురిపాలు
పరిమళించు పువ్వుల్లో
ప్రణయ వీణ పలుకుల్లో
పాటలై సాగి వేళల్లో
మాటలే మూగబోయి వేళల్లో
పట్ట పగలే చుక్కలు పొడిచే
పాలవెల్లి పుంతల్లో
పూల గాలి రెక్కలు తొడిగి
విహరించు వేళల్లో
పలుకులలో తేనెలొలుకు చిలకా
పరువాలలో పొంగి పోవు మొలకా
నే నేవరో నీకేరుకా
నీ రాకతో నాకు నిదుర రాక
నువ్వెవరో నేనెవరో
ఇలా వున్నమే ఒకే జతలో
                    -కళావాణి-


No comments:

Post a Comment