నెమలి నేరజానవే నీవు
నేలపై పురివిప్పి నర్తించెవు
నెమలి పింఛానికి ఎన్ని వర్ణాలు అద్దావు
నల్లనయ్యకు శిఖి పింఛమౌళి బిరుడునిచ్చావు
నాట్య శాస్త్రానికె వన్నె తెచ్చావు
నాట్య మయూరి నీ నడక వయ్యారి
నీలి మేఘాల ఉరుముల మెరుపులు
నీ కాలి అడుగులకు వేసే తాళాలు
నీలి నీలి వర్ణాలెన్నో నీ గళంలో
నిగనిగ ల మెరుపులే నీ గళం వొంపుల్లో
నీ వన్నెకు మెచ్చి ఇచ్చారా కిరీఠo
వన మయూరీ వన్నె చిన్నెల తువ్వాయి
నీ సరి ఎవోయి
No comments:
Post a Comment