Wednesday, 20 August 2014

నీ రాధనురా రాదేయా

నువ్వు నా కళ్ళలోకి చూడు నువ్వే కనిపిస్తావు
నువ్వు నా మనసులోకి వేదికి చూడు నీవే నిండి ఉన్నావు
నిన్ను వదలి ఉండలేను రా నీ రాధనురా రాదేయా
నీ కన్నుల కనుసన్నలలో నన్ను దాచరా కన్నయ్య
నిన్ను తలచి తలచి నన్ను నేను ఏనాడో మరిచాను
నీ రాకకై వేచి వేచి వెన్నెలలో వేశారాను
నీవు రాణి వేల విరహపు సెగలు నన్ను దహీంచునురా
నిన్ను కన్న వేల మది వేయి వీణలు మీటునురా
నీలమోహనా నీ అలికిడి విన్ననా మనసున మయురంబులై నటిఇంచు
నీ చేయి తాకిన నా మెనూ వేయి మెరుపు తీగలు వెలుగులు వెలిగించు 
నీరజాక్షా వేణుగాన సమ్మోహనా నా మది రాగాలు ఆలపించు
నీలమేఘశ్యామా ఏనాడో నా మనసు నీవసమా నన్నాదరించు
నీ పలుకే సుస్వరాల రాగామలికలే కూర్చు
నీ ప్రేమలో మది బృందావనిలో పొన్నలు పుఇంచు
నీ మురళిని నేనై నను నీ అధరములలో చేర్చు
నీ ప్రణయాన నను పరవసించనీ మైమరచి
                                             -కళావాణి -

No comments:

Post a Comment