Thursday, 21 August 2014

నిరీక్షణ

వాలు పొద్దుల్లో కన్నులు కాయలు కాచేలా వేచితి
వొద్దికగా వంగపండు రంగుచీర కట్టితి
వడి వడి గావచ్చా అలికిడి విని నీవని
వాడివాడి గా వెన్నెల గుచ్చే ఆలస్యమయినదేమని
వాడిన జాజులు జాలిగా చూసే నీ పెనిమిటి రాడేమని
వేడి నిట్టుర్పు లాయె ఏమయినదొనని
వేచి వేచి కన్నిరైతి జాడయినాలేదని
వినువీధికి చుపుంచి వేచి వేచి వగపాయే
వంటరినయిన నీ ఉహలు వదలవాయే
విమలము లేని మనసాయె
వోదార్పు లేని వియోగాలాయే
విరించి వేసిన వింత బంధం
విడలేని వివాహ  భంధం
విడిపోము మనము
                -కళావాణి-

No comments:

Post a Comment