Thursday, 21 August 2014

వేల్లనీయరా కృష్ణా వేళాయెరా కన్నా


వేలాయెరా మతిమాలి
వేల్లనివ్వరా వనమాలి
వేణుఉది వేదించకూరా
వేళకాని వేల కృష్ణ
వెన్నదొంగా నా మది దోచితివి
వేకువనే నీ తలపులు నను నిలువనీవు
వేచి వేచి విరహంతో వేదిస్తావు
వెన్నులో సెగలవును
వెన్నoటే తలపవును
వేగలేక వెతలవును
వేళకాని వేల నీ పిలుపులాయే
వెదకి వెదకి వేదనాయే
వేలదాటి రాకలాయే
వెళ్ళనీయక నీ రూపు నా కాళ్ళకు బంధమాయే
వేల్లనీయరా కృష్ణా వేళాయెరా కన్నా
                                     -కళావాణీ -

No comments:

Post a Comment