Monday, 11 August 2014

పుత్తడి బొమ్మ రాధమ్మ

పూవ్వులో తావిలా నిన్నంటి నేను నాలో ఒదిగి నీవు
పూబొని విరిసేను నీ వదనము నను గనినంతనే
పున్నమి జాబిలివి పట్టపగలే వెన్నెల విరిసేనే
పువ్వంటి నీ మేని అందాలు తాకి పులకించితినే
పుడమి పుణ్యమెమో మన జంటతో తరియించెనే
పూమాలలాయే నా మేడలో నీ మమకారమే
పురుషులలో పుంగవుడనైతి నీ ప్రేమచే
పుండరీకాక్షుడనని పులకించావే మైమరపించవే
పుత్తడి బొమ్మపూరెమ్మ నీవేనా ప్రాణమమ్మా
పునర్వసుడకు ప్రతిస్పందన నీవేనమ్మా
పున్నాగపూవే నువ్వు నీ చుట్టూ బ్రమరము వోలె నేను
పూర్వజర్మ సుక్రుతములే ఇది మధురము నీవు నేను
పురాణాలలో నిలచి ఉండు మనప్రేమ ఇది నిజమౌను
                                                       -కళావాణి -



2 comments:

  1. Have no words to explain how beautiful it feels to read your poetry..
    You should publish them!

    ReplyDelete