Thursday, 26 July 2018

మనసు మహా జాణ మాటవినదు
మచ్చుకైనా మనశ్శాంతి గా వుండనీయదు
మంచి వైపు అడుగెస్తే వెనక్కి లాగుతుంది
మనిషిగా ఎదగడానికి ద్యానం చెస్తుంటె దారిమళ్లిస్తుంది
మరచిపొయిన వెనకటి సుద్దులన్నీ వల్లే వెస్తుంది
మక్కువైనవన్ని గుర్తుచేస్తుంది
మనసు కుదురుగా వుండదే
మసిపూసి మారేడు కాయచెస్తుందే
మభ్యపెడుతుంది చుట్టూ వున్న చెత్తను పెరుస్తుంది
మదిని ఒక్క క్షణం వదలక ఆలోచనలతో ముంచెస్తుంది
మరుగున పడి కుళ్ళిన వ్యర్థాలే జ్ఞాపకాలు
మంచివైనా చెడువైనా జ్ఞాపకాలవల్ల వుండవు ఎలాంటి ఉపయొగాలు
మలచుకొవాలి మనసుని ఈ క్షణం లో ఆనందంగా జీవించేలా
మళ్ళీ వచ్చే క్షణాలకు ఈక్షణం మారాలి ఒక తియ్యని అనుభంలా


No comments:

Post a Comment