మావారికి జబ్బు చెసి మంచంపట్టారు సేవలు చేస్తుంటే సిగ్గు పడుతున్నారు ఎన్నోసంధర్భాలలో నాకు తన సాయం అవసరం అయినప్పుడు చెయలేకపోయాడు ఇప్పుడు నేను చెస్తుంటే ఆనందం భరోసా కలుగుతోంది తనకి గతంలో నీలా అవసరం నాకువస్తే నీవు లేవే ఎందుకు అని అడిగినదానికి సమాదానం లేదు సిగ్గుతో తలదించుకుంటే జాలెసింది గతం గుర్తోచ్చి బాదెసింది జీవితకాలంఅంతా ఇలానే ఆరోగ్యం తో ఉంటాను అన్నధీమాగా వున్న మావారి అహం కాస్త దిగిపొయింది. ఈసారి నీకు జబ్బు చేస్తే నేను ఇలాగే అన్ని పనులు చేస్తాను అని అంటుంటే చిన్నపిల్లాడిలా నవ్వు ఆగలేదు నాకు అయినా జబ్బులు రావునాకు నీకు ఆ అవకాశమూరాదు అన్నాను ఎప్పుడూ ఇలాగే వుంటావా అన్నాడు అవును ఇక జబ్బు అన్నదే నాకు రాదు అన్నాను కాసెపు ఆలోచించి ఆరోగ్యంగా వుంటే మంచిదేలే అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నారు. సాటిమనిషికి సాయపడాలన్న చిన్న విషయం అర్ధం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మావారికి.
No comments:
Post a Comment