Friday, 16 March 2018

వర్షం వచ్చి అలా పలకరించి వెళ్ళిపోయింది
వరమల్లె వస్తుంది వాన నిలువెల్లా తడిపెస్తుంది
వీచె గాలికి నేను గల్లంతు అవుతానేమొ
వీణలు మీటి వీణాగాలు పలికిస్తున్నాఏమొ
వాలే ప్రతి వాన చినుకూ వొళ్ళంతా గిలిగింతలు పెడుతోంది
వాకిట్లో నిలుచునివున్న నన్ను ఊరిస్తోంది ఉడికిస్తుంది
వెల్లువల్లె ముంచెస్తుంది
వెల్లివిరిసి మత్తెక్కిస్తుంది
వానకారు రాలేదు ఎంటో వింతవాన
వానంటే వానకాదు వలపులవాన



1 comment: