నీ భాగస్వామిని నువ్వే ప్రేమించాలి. నీ మనసులోని ఎప్పుడు తన భావనలే మెదలాలి ఎక్కడున్నా తన బొమ్మనే ఉహించుకుని i love u చెప్తూ ఉండాలి 10,15 times మించి చెప్పుకోవాలి ఇలా చేయగలిగితే నీలోని ప్రేమ నీ భాగస్వామికి చేరుతుంది తనలో కుడా మార్పు వస్తుంది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చే ముందు అలా అనుకుని చూడండి మార్పు మీరే గమనిస్తారు నీ భాగస్వామిపై కోపం వచ్చినపుడు నీ భాగస్వామి కున్న మంచి గుణాలు ఒక మూడింటిని రాయండి అలా రాస్తే మీ మనసులో కోపం పోయి ప్రేమతో నిండిపోతుంది. నీ భాగస్వామి కోప్పడుతుంది అంటే దానికి కారణం భయం అది భయమని వారికే తెలియకపోవచు.నీ భాగస్వామి భయపడుతుంది అని గ్రహిస్తే చాలు సమస్య సగం తీరినట్టే అలా కోప్పడినప్పుడు"భయపడకు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు" అని దగ్గరకు తీసుకుని భుజాన్ని తట్టి ధర్యం చెప్పాలి కుదిరితే కౌగలించుకుని భరోసా ఇవండీ నేనున్నాను నీకేం కాదు నేను చూసుకుంటాను నువ్వు ధర్యంగా ఉండు అని చెప్పే చిన్న మాట ధర్యాన్ని ఇస్తుంది.మెల్లగా భయానికి గల కారణం మంచి మాటలతో అడిగి తెలుసుకొని పరిష్కరించండి. భయం కలిగినప్పుడు మనం భయానికి గల కారణం ప్రశాంతంగా ఆలోచించాలి నాకు భయం వేస్తుంది ఇలా భయపడడం వళ్ళ ఏంటి ప్రయోజనం, దీనికి ప్రత్యామ్నాయంగా నేను ఎం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. వ్యాపారంలో నష్టం వచ్చింది బాదేస్స్తుంది సరే భాదపదడినంతమాత్రాన లాబాలు రావుకదా సరే నష్టం వచ్చింది నేను కృంగిపోను ఇది నా మంచికే జరిగింది నేను ఇంకా జాగర్తగా ఉండాలి నేను ఇంత చిన్నదానికే భయపడితే ఎలా అనుకోవాలి ఇది వ్యాపారంలోనే కాదు సంసారంలో కుడా ఇలాగే సమస్యలనుండి బయటపడాలి జరిగిపొయినదాన్ని వెనక్కి తీసుకు రాలేం అందుకే జరిగేవన్నీ మనమంచికే అనుకోవాలి భాదపడితే ఆరోగ్యం పాడాయి మల్లి ఆరోగ్యం పాడయిందని బాధపడాలి. ఒక కుటుంబంలో ఒకరి ప్రవర్తన సరిగా లేదు అంటే దాని వల్ల కలిగే బాధ అందరిది అవుతుంది అందుకే మనవల్ల మనవాళ్లే బాధపడకుండా ఉండాలంటే మనమే మారాలి. నీ భాగస్వామిని నువ్వే ద్వేసిస్తే అదే ద్వేషమే నీ భగస్వమినుండి నీకు ఎదురౌతుంది. అదే ప్రేమిస్తే అంతే ప్రేమ నీకు ఎదురౌతుంది కేవలం నువ్వు మారడంతోనే నీతోపాటుగా నీ భాగస్వామి లో మార్పు వస్తుంది ప్రతిరోజు నీకు నువ్వు మనసులో "నేను lovely person ని "అని అనుకుంటూ ఉండాలి. ఇది మనసు మ్యాజిక్. ట్రై చేసి చుడండి.
No comments:
Post a Comment