వసంత కాలం లో వేడి వాడి ఎండల్లో
వచ్చే చల్లగాలికి వేచే స్వేద దేహం
వసంత కోకిల కమ్మని రాగాలతో
వినిపించే కోటి స్వరాల జల్లులు
వాలి ఉగే కొమ్మల్లో విరజాజులు విరిసే
వాలే పొద్దులో చల్లగాలికై తపించే మనసే
విహరించే ఆకాశాన అప్పుడప్పుడు నల్ల మబ్బులు
విల్లులా వంచిన ఇంద్రధనుస్సు మెరిసే ఏడూ రంగులు
వాన జల్లు కోసం తపించే పుడమి తల్లి
వర్షించిన నీటికి తడిసి న మట్టి మత్తుజల్లే
వన మయూరి పురివిప్పి నర్తించే
వేసవిలో వర్షం జల్లులో తడిసిన మధురమే
వజ్రంలా మెరిసే చినుకుల్లో ముద్దయితే అతి మధురమే
No comments:
Post a Comment