Monday, 27 April 2015

ప్రేమ

ప్రేమ అనేది ఒక మనిషిని చూడగానే పుట్టేది కాదు. చూడగానే పుట్టేది ఆకర్షన అది ఎక్కువ కాలం ఉండదు. నిజమైన ప్రేమ ప్రతిసారి కలిసి మాట్లాడే మాటల్లోనూ ప్రేమగా తాకే స్పర్సలోను కొంత కొంత అర్థం చేసుకుంటూ వెళ్లేదే  రొజూ కొంత కొంత  ప్రేమని పరిచయం చేసుకుంటూ పోవాలి  రోజు తను ప్రేమించే మనిషితో వీలైనంత సమయాన్ని గడపాలి జోక్స్ వేయాలి చిలిపి పనులుచేయాలి, ముఖ్యంగా ప్రేమించినవారిపట్ల భద్రతా భావాన్ని కలిగించాలి నమ్మకంకలిగి ఉండాలి నిజాయితిగా ఉండాలి  ఈ విషయాలు  మాత్రం చాలా జాగర్తగా ఉండాలి ఇదే ప్రేమకు పునాది ఈ రెండూ లేనివాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా ప్రేమలేనట్టే, దూరంగా ఉండి ఎన్నో మాటలు చెప్పుకునే వారి ప్రేమా అంతే గాలిలో మేడలు కట్టినట్లే ఉంటుంది అది ఎక్కువకాలం నిలవదు ప్రతిరోజు పక్కనే కూర్చుని కష్ట సుఖాలను పంచుకునే వారు కప్ కాఫీ కుడా ఇవ్వకపోయినా సరే వాళ్ళలో గొప్ప ప్రేమ ఉంటుంది గిఫ్ట్స్ ఇవ్వకపోయినా వారి మద్య ప్రేమ ఉంటుంది ప్రేమకు అర్థం చేసుకునే గుణమే పునాది అధికారాలు చెలాఇంచడమ్ అహంకారాలతో ఒక మనసును గెలవలేరు ప్రతిరోజు నీపై నాకు ఇంత గొప్ప ప్రేమ ఉంది అని చేప్పడం కన్నా ప్రేమించిన వారికి ఎంకావాలో వీలైనంత చేతనైనంత సాయం చేయగలిగితే చాలు నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది ప్రేమించే వారు కొన్ని కట్టుబాట్లు ఉండాలి ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి ఒకె మాటపై ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోగలగాలి ఒక పొరపాటు జరిగితే ఎవరికీ వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అంతే కాని నీది తప్పు అంటే నీదే తప్పు అని వాదించు కోకూడదు ఎదుటివారిని మార్చాలి అనే ఆలోచన మానేయాలి ఎందుకంటే ఎవరినైనా మార్చే శక్తీ మన చేతుల్లో ఉండదు అలా మర్చలేరుకుడా అలా మార్చాలి అనుకోవడం కుడా మూర్ఖత్వం సమస్యకు పరిష్కారం మనమే మారాలి ఇది వింతగానే ఉంటుంది కాని నిజం మనలను మనమే మలచుకోవాలి మన ప్రేమని గెలుచుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా దానికి కారణం మనమే మనలోని ఆలోచనలే దానికి ఎదిటివాల్లె కారణం అనుకోవడం ముర్కత్వం నాదెం తప్పులేదు అనుకోవడం మూర్ఖత్వం మనం ప్రేమించే మనిషిని ఎక్కువ ప్రేమించ గలిగితే ఎగోడవాలూ రావు గొడవలకు ముఖ్య కారణం భయం.  గొడవ పడేవారికి ఈ విషయం అర్థం కాదు కాని భయమే అన్నింటికీ కారణం.  ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ వారే ఆలోచించగలిగితే సమస్యలే రావు ప్రేమికులుగాని, పెళ్ళైన వారు కాని ఇప్పుడు వారు ఉన్న స్థితికి వారే కారకులు అది సంతోషంగా ఉండటానికైనా దుఖంలో ఉన్నా దానికి కారణం మీరే నీ భాగస్వామి కి i love u చెబుతూఉండు  ఎంత కోపంలో ఉన్నా ఇట్టే కోపం తగ్గిపోతుంది నీ మనసులో ప్రేమను నింపుకొని చూడు అన్ని మారిపోతాయి ఇది నిజం first మనమే మారాలి ప్రేమనిండిన మనిషిలా మారిపోవాలి ఇలా ఉండగలిగితే ఎజంటా విడిపోదు

  

No comments:

Post a Comment