Thursday, 23 April 2015

ఆమని


ఆమని అందాలూ అల్లుకుపోయే లతా సౌరభం
అడుగడుగునా అద్వితీయ సుమనోహర కావ్యం 
అలవోకగా సాగే సంపెంగల సుగంధ పరిమళం 
అంకురించే నాలో సరికొత్త భావాల స్వరజతం 
ఆలకించే కనులకు ప్రకృతి ఉగాది సంబరం 
ఆలపించే వసంత కోకిల గానం 
ఆహ్వాదించే మనసుకు అద్వితీయ భావం 
ఆణువణువూ పులకలే పుడమి అందం 
అరికాళ్ళకు రెక్కలుమోలిచే నా ఆశ నిజం
అంబరాన్ని తాకి మబ్బుల తేలే  నా పాద మంజీరం




No comments:

Post a Comment