Friday, 24 April 2015

సందెల్లో అందాలు


ఆ నింగి ఎర్రని చీరకట్టి సూర్యున్ని సిందురంగా మార్చుకుంది
మబ్బులను మల్లెలుగా ముడిచింది
అలల కెరటాలతో సంద్రం తాకాలని తపిస్తుంది 
నింగి వంగి సంద్రాన్ని ముద్దాడింది 
ఆకాశంఅల్లంత దూరాన సంద్రాన్ని మబ్బులతో కమ్మేసింది 
అంబరం లోని  రంగులన్నీ సాగరం విలీనం చేసుకుంది
ఈ సంగమం సందెవేళ కన్నుల విందులయింది 
విహంగాల కల కల కిల కిల  రావాతతో శృతి పలికింది 
చల్లగాలి పిల్ల తెమ్మెరతో  ఉగిసలాడింది  
ఇది చూచిన నా మది తన్మయం చెందింది 
ఈ ప్రకృతికి ఏది సాటిలేదంది 
కదలనీక కాళ్ళకు బంధం వేసింది 
కారు చీకటి కమ్మే దాకా నను మంత్రించింది,

No comments:

Post a Comment