గోపాలా ఎల్లలు లేవురా నీ ప్రేమకు
గోవులకాచే గొల్లబాలురకు నీవే దిక్కు
గోవులు మురిసే మురళి గానమునకు
గోవర్ధన గిరిధారి నీవే ఆధారం రేపల్లెకు
గోధూళివేళ నీ పదములే దారి గోవులకు
గొల్లల మానసచోర జల్లను ఉల్లమునకు
గొల్ల భామలను అల్లరి చేసేవు వెన్నకోరకు
గోవిందా వేచితి నీ ముఖారవిందమును కాంచుటకోరకు
గోచరించుటలేదే ముగ్ధ మనోహర రూపము నా కన్నులకు
No comments:
Post a Comment