చందమామతో చెలిమి
జాబిల్లి కొండ ఎక్కి కూర్చుంది
జాజిపువ్వు నవ్వులు ఆరబొస్తోంది
వెన్నెలమ్మతో మంతనాలు ఆడి
వెన్నదొంగల్లే నా మనసు దొచేస్తుంది
కన్నుల్లో దోబూచాడే నిన్ను కౌగిట్లో బంధించాలి
కరిగిపొతావో పారిపొతావో చూడాలి
రాతిరైతే చాలు వెన్నెల చిచ్చు రేపుతావు
రాగాలు ఆలపిస్తే రాలేవు నీవు
పలకరిస్తె చాలు పులకించి పండువెన్నెలు పంచుతావు
పండగంటి వెన్నెలంతా పానుపెసి కవ్విస్తావు
నెలరేడా నెలకు దిగిరావా
నెమలినై నాట్యం చెస్తా చూస్తావా
నువ్వు కవ్విస్తే వెన్నెలైపొతా
నులివెచ్చగా నీలో కలిసిపొతా
నన్ను నేనే మరచిపొతా
నవ్వునై నీ పెదవిపై మెరిసిపొతా
ముగ్దమనోహరం నీ మొము
ముందరికాళ్ళకు వెస్తావు బంధము
తారనైపోతా నీ చెరువైవుంటా
తాపసినై నీ చెలిమి నే పండించుకుంటా
జాబిల్లి కొండ ఎక్కి కూర్చుంది
జాజిపువ్వు నవ్వులు ఆరబొస్తోంది
వెన్నెలమ్మతో మంతనాలు ఆడి
వెన్నదొంగల్లే నా మనసు దొచేస్తుంది
కన్నుల్లో దోబూచాడే నిన్ను కౌగిట్లో బంధించాలి
కరిగిపొతావో పారిపొతావో చూడాలి
రాతిరైతే చాలు వెన్నెల చిచ్చు రేపుతావు
రాగాలు ఆలపిస్తే రాలేవు నీవు
పలకరిస్తె చాలు పులకించి పండువెన్నెలు పంచుతావు
పండగంటి వెన్నెలంతా పానుపెసి కవ్విస్తావు
నెలరేడా నెలకు దిగిరావా
నెమలినై నాట్యం చెస్తా చూస్తావా
నువ్వు కవ్విస్తే వెన్నెలైపొతా
నులివెచ్చగా నీలో కలిసిపొతా
నన్ను నేనే మరచిపొతా
నవ్వునై నీ పెదవిపై మెరిసిపొతా
ముగ్దమనోహరం నీ మొము
ముందరికాళ్ళకు వెస్తావు బంధము
తారనైపోతా నీ చెరువైవుంటా
తాపసినై నీ చెలిమి నే పండించుకుంటా
No comments:
Post a Comment