Wednesday, 20 February 2019

వెన్నెల్లో గుసగుసలు
కన్నుల్లో మిసమిసలు
తలుకుమనే తారలే తెల్లబోయి చూసేను
కలువలు కొలనులో కన్ను గీటి పిలిచేను
మరులుగొలిపే మామవే మా మనసు దొచి పోయేవు
విరుల సిరుల నీ వెన్నెలలో మైమరచిపోయేము
మాఘమాస వేళ మంచుతేరలు వీడి వెచ్చనైన కౌగిళ్ళు ముచ్చటించుకున్నాయి
మయూరాలు పురివిప్పి  నవ నాట్యమెదో చెసాయి
నందన వనములో మురళీ పాట మొగింది
చందన చలువతో చందమామ మెరిసింది
మా మాటలన్ని మూట కట్టి పాటలే పాడేము
మా మామవంటి చందమామ తో జతకట్టి ఆడేము
మల్లెవంటి చంద్రుడా మత్తుమందు చల్లరా
చల్లనైన వేళలో నీ వెన్నెలంత మాదిరా


No comments:

Post a Comment