Wednesday, 27 February 2019

అందరంకలిసి ఆనందించె రోజు వచ్చేసింది
అందరాని ఆ చందమామ అందినంత ఆనందంగా వుంది
మాటలన్నీ మనసులో గూడుకట్టుకున్నాయి
మాలలుగా అల్లి మమతలు మెడలో వేస్తున్నాయి
మనసు ఉప్పొంగి ఉరకలెస్తోంది
మదనపడే నా మనసు ఆనందాల వెల్లివిరిసింది
ఆగలేక ఆనందభాష్పాలు పొంగుతున్నాయి
ఆకాశం అంచులు తాకుతున్నాయి
కళ్ళు కాయలు కాచెలా ఎదురు చూసా ఈరోజు కోసం
కనువిందు చెసే నా చిట్టితల్లి ఈరోజే ఇస్తుంది దర్శనం
ఆ స్పర్శ సృతిమెత్తనిది
ఆ పలుకు తెనెకన్నా తియ్యనిది
చిన్నారి మనసులో నాపై ప్రేమ మరువలేనిది
చిట్టిపొట్టి కథలన్నీ విని చిరునవ్వు చిందిస్తుంది
పాలుకారు చెక్కిలిపై ముత్యమంత ముద్దు
పారాడు పాదాలు నడిచొస్తే మురిపాలకు లేదు హద్దు


No comments:

Post a Comment