Tuesday, 19 February 2019

వెన్నెల్లో కూర్చుంటే వెన్ను జల్లు మంటుంది
వెన్నలా కరిగే మనసు నా వెన్నంటి నడిచింది
మేడపై వెన్నెలమ్మ ఉల్లి పొరల చీర పరిచింది
మేటికీ  నీతీయని సాగత్యం ననుఅల్లుకునే వుంది
విడదీయనిదేలే మన బంధం
విలువలతో నీ ప్రేమ తెలిసే అది ఎంతో ఉన్నతం
నీవు ఎంతో మారావు నాకోసం
నీమనసున నాకున్న స్థానం ఆ హిమవత్ పర్వతం
చద్రుని కాంతిలా నీ చెలిమి చల్లదనం
చందన పరిమళమే నీ కౌగిలివెచ్చదనం
నీతో కలిసుంటే కలహమైనా కమనీయం
నీ తోడే నాకు నవ జీవనం
పున్నమిలో పులకింతల జ్ఞాపకం
పుస్తకంమే రాయాలి పూసల పుస్తుల కావ్యం
                                                    శ్రీ వారికి వెన్నెల లేఖ

No comments:

Post a Comment