Friday, 22 February 2019

వాన జల్లులో తడిస్తే ఆనందం
వాగులు పొంగి వనమంతా వసంతం జల్లితే ఆనందం
చందనాల చందమామ వెన్నెలెంతో ఆనందం
చల్లగాలి చిలిపిగా గిలిగితలు పెడిడుతుంటే ఆనందం
ఉదయకిరణాలు మెనిని తాకితే ఆనందం
ఉప్పెనై సంద్రం అల ఒడ్డున ఎగసి పాదం తాకితే ఆనందం
మంచు బిందువులు నేలపై ముత్యమై మెరిస్తే ఆనందం
మయూరం నర్తిస్తే నయనానందం
కొయిల పాటలో తేనెలూరు స్వరం ఆనందం
కొండలూ కోనలూ మబ్బులు కమ్మేస్తే ఆనందం
కొలనులో కలువ నవ్వితే ఆనందం
కొమ్మ పై గువ్వ కువకువలాడితే ఆనందం
అంతులేని అందాలను ఆశ్వాదిస్తూవుంటే అమితానందం






No comments:

Post a Comment