Saturday, 18 August 2018

విత్తు లే వెయలేదు కొన్ని ప్రాంతాల్లో
విపత్తులు మారెనా రైతు జీవితాల్లో
నేల అదునుకై వానకొసం వేచి వేసారిపొయాడు
నేడు నేల పదునుకై చినుకుకోసం చింతిస్తున్నాడు
వానచినుకుకై వగచె రైతన్నలు
వాగులు వంకలు పొంగిపొరలే కాలాలు
ఆ రోజులు మనకు ఇకరావు
ఆచరణలో విలువలు లేవు
చెట్లను బలితీసుకున్న పాపమొ ఏమొ
చెప్పినా వినని మనిషికి ఇది శాపమెమొ
సమూలంగా చెట్లను నాశనం చెశాడు
సజీవ దహనం చేశాడు స్వార్ధానికి వాడుకన్నాడు
తెలిసిచేసినా తెలియక చేసినా దానిఫలితమే వర్షాలు రాని స్థితి
తెలివైన స్వార్థ మానవుని మస్తకములో పుట్టే ఆలోచనల వల్లే దుస్థితి
ఒకచోట క్షామం
మరొక చోట దుర్భిక్షం



No comments:

Post a Comment