Saturday, 18 August 2018

తరలని దారి తొలగి రాతిరిని

తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని 
 


చలనచిత్రం :స్వాతికిరణం 
రచన        :  శ్రీ  సి.నారాయణ రెడ్డి  గారు  
గానం        :  వాణి  జయరామ్ గారు 
సంగీతం    :  శ్రీ  కే.వి .మహాదేవన్ గారు 
దర్శకత్వం :  'కళాతపస్వి' శ్రీ  విశ్వనాధ్  గారు 


తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
నీ దోవ పొడవున కువకువల స్వాగతం 
నీ కాలి అలికిడికి మెలకువల వందనం 

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ


ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు 
ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల  గాలి సంగతులు 
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి  
నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు 
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు 
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు 
తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని 

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
నీ దోవ పొడవున కువకువల స్వాగతం 
నీ కాలి అలికిడికి మెలకువల వందనం 


తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

No comments:

Post a Comment