Friday, 10 August 2018

కల

మళ్ళీ మొదలైయింది కొత్తకల నెరవెరాలి చిలిపికల
మలయమారుతంలా మనసును మైమరపించెకల
మానస సరోవరంలా నిర్మలమైన కల
మావిచిగురులా మంగళకరమైనకల
మిక్కిలి మక్కువైనకల
మిసిమి వన్నెల కల
మీటేవీణలా లోలోన దాగే కల
మీనాక్షి కన్నులా నాలొనే దాచె కల
మురిపించి మైమరపించె కల
ముచ్చటగా మధురమై నను దొచేకల
మూగనైపొయి మమత చిగురించేకల
మూసిన తలుపులు తెరిచే తెనెలొలికే కల
మెత్తగా మంచుకన్నా చల్లనైన కల
మెల్లగా మత్తైన మల్లెల కల
మేఘాలపై తేలిఆడే కల
మేఘమాలతో ఊసులాడే కల
మైమరపించే కల
మైకంలో ముంచేకల
మొదలైంది మనసైన కల
మొమాటాలే లేని మొగలిపువ్వంటికల
మోయలేక మాటరాక తాళలేని కల
మోజు పడి మాయలో పడే కల
మౌనమై మాటలే లేనికల
మౌనరాగాలు మదిలో పలికించే కల
మంజీరమై గల్లున జల్లున మ్రొగేకల
మంజులనాదాల మనసును మీటేకల





No comments:

Post a Comment