Wednesday, 29 August 2018

నా కంటి కదలికల్లోని భావాలన్నీ ప్రియమైన మా వారి                     కొసమే కాలం గడిచే కొలదీ భావం స్థిరమౌతుంది
మనసున పొంగేభావాలు నాకు మాత్రమే సొంతం
మననం చేసే ప్రతి భావనా మా సంసార మాధుర్యం
ఔనో కాదో అనుకునే అల్పమైన మనసుకాదు నాది                                స్థిరమైనది స్వచ్ఛమైనది
ఔనత్యానికి దాంపత్యానికి మా శ్రీ వారికే సొంతమైనది 
నా మాటల మాధుర్యం మావారికే తెలుసు
నాలో అన్ని అంశాలు అవపొసన పట్టిన మా వారి మనసు
అన్నీ వారి జ్ఞాపకాలతో నిండినదే నా జీవితం
అనిర్వచనమైన కావ్యమై ఈనాటికీ నవ్య నవనీతం
లౌక్యనికి తావులేదు తేటతెల్లమె నామనసు
లౌకిక వాదాలతో పనిలేదు నేను ఎప్పుడూ కాను అలుసు
మనసైన మాటలు స్పందించిన క్షణాలను రమ్యంగా రచించుకుంటాను
మరెవరోకో నాభావన తెలిపెయత్నం కాదంటాను
నీ సందేశాలకు స్పందించడం పొరపాటో ఏమొ
నీవు తెలిపే ప్రతి మాటా నా మనసుకు కష్ఠం













No comments:

Post a Comment