Friday, 10 August 2018


కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే 

గుమసుమ గుమసుమ గుపచుప్
గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో!!
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
(కన్నానులే)

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే 
చిత్రం: బొంబాయి
సంగీతం: ఎ ఆర్ రెహమాన్
రచయిత: వేటూరి
గానం: చిత్ర

No comments:

Post a Comment