Friday, 25 May 2018

పక్షిలా అలా అలా ఆకాశంలో విహరిస్తె ఎంతబాగుంటుంది
పట్టు కొమ్మలపై వాలి నెలపై చిన్నగా కనిపించే అందరినీ చూసి నవ్వుకోవాలనుంది
కొయిలగా ఒకరోజు మారాలి
కొత్త పాట సరికొత్తగా పాడాలి
పిట్ట లా రివ్వున ఎగరాలి
పట్టిపట్టి పొలాల్లో గింజలన్నీ తినాలి
లేడి పిల్లలా అడవి అంతా గంతులెయాలి
లేలేత చిగురులు తింటూ బెదురు చూపులు చూసె కుందేలు నైపొవాలి
పూచె పూలపై వాలే శీతాకోకచిలుకై పొవాలి
పూలమకరందం తాగె తెనె గువ్వనవ్వాలి
గలగల పారె గొదావరిలా మారిపొవాలి
గగనంలొ మబ్బునై కొడాకొనలను కమ్మెయలి
నెమలినై పులకించి పురివిప్పి నర్తించాలి
నెరవేరు నా కలలన్నీ  దైవమె మెచ్ఛి వరమివ్వాలి




No comments:

Post a Comment