కవితలా నవ్య కాంతిలా నా జీవన కావ్యం నీవే
కవ్వించె నవ్వించే నవ వసంత రాగం నీవే
కన్నులలో పదిలపరిచిన వన్నెల రూపం నీదే
కన్న నా కలల రాజువి మహరాజువీ నీవే
కలికి కాంత నె నీఇంట వలపుపంట పండితునే
కళ్యాణ తిలకముతొ పారాణిపాదాల నీ పడతినినేనే
కలిసి ఎన్ని పున్నమిలు చూసామొ
కసిరినా విసిగినా అంతా ప్రేమెనేమొ
కలహించిన మన కలహాలు పట్టు మని పదినిషాలైనా నిలువలేవు
కబుర్లు చెబుతూ కలుపుకు పోతుంటే వెంటనే ముసురుకునెది ముసిముసి నవ్వు
కలువలరేడు తో తియ్యని ఊసులు
కలల రే రాజు మాశ్రీవారి మిసమిసలు
కళ్ళకు కట్టి నట్లు అన్నీ జ్ఞాపకమే నాకు
కలసివుంటే తనతో నాకాటుక కళ్ళకు కునుకు
కలత నిదురే తనచెంత లేని రేయి నాకు
కట్టు కథే అది మాకు ప్రేమ లేదన్నది
కమ్మని ప్రేమ మా మనసున నిండిపొయింది
కలహాలు కమనీయ కావ్యాలు
కలిసి నవ్వుకునే హస్యాలు
కలిమి లేమి కేవలం కాకతాళీయం
కష్టాలను ఇష్టాలుగా మార్చుకున్నాం
కడతేరె దాకా ఆనందంతో కాపురం వుంటాం
కవినై మా కాపురాన్ని కావ్యమై రచించినా ఇంకాస్త మిగిలేవుంటుంది
కవిత్వాన్ని కలబోసి అక్కడక్కడ రంగులద్ది రంగరిస్తే మాకథ గ్రంధమే అవుతుంది

No comments:
Post a Comment