Sunday, 27 May 2018

వాగులు వంకలు చిన్నతనంలొ చూసాం
వానలు కురిసి మహావృక్షాలు సంతరించుకుని రావాలి పూర్వ వైభవం
వాహనాల జోరులో కలుషితం అవుతోంది వాతావరణం
వారసులు కావాలని కంటున్నారు జనాభాని విపరీతంగా పెంచెస్తున్నారు
వాటాలు వెసి ఆస్తులు పంచుతున్నారు ఆక్సిజన్ లేక ఆస్తులు అమ్మినా శ్వఛమైన గాలిని కొనలేరు
వాటర్ ని కొంటున్నారు రేపు గాలినీ కొంటారు కొనలేని పేదలు మరణిస్తారు
వాపోయి ఎమిలాభం వారసులూ వుండరు వారసత్వం మిగలదు
వాడకం గమనిస్తే యెధేచ్చగా ప్లాస్టిక్ వాడి నీటినీ, నేలని సముద్రాన్ని కాలుష్యం చెస్తున్నాడు
వాణిజ్యం వ్యాపార సౌలభ్యం కొసం వాడె ప్లాస్టిక్ సముద్ర జీవరాసులను అంతరించెలా చెస్తున్నాయి
వాత్ఛల్యం, ప్రేమ ప్రకృతి పట్ల బాధ్యత మనిషికి కరువయ్యాయి
వాడిపొయి బీడు బారిన భూములన్నీ పచ్చదనాన్ని సంతరించుకొవాలి
వాగ్దానం చేసి మానవులంతా భక్తితో బాధ్యతతొ                       ఒక్కటిగా ఏకమై మునుపటి కన్నా మిన్నగా                           నేలను చెట్లతో నింపాలి




No comments:

Post a Comment