Monday, 30 April 2018

గురు పౌర్ణమి

పుట్టింది రాజవంశం లో మనసు మాత్రం కడు సున్నితం
పున్నమిరోజే పుట్టుక   మళ్ళీ పౌర్ణమికే జరిగిది బుద్ధుని జ్ఞనోదయం
పున్నమికి గౌతముడికి వుంది ఎదొ అవినాభావ సంభంధం
పురిటినొప్పులతో  పల్లకీ దిగిన మహారాణికి అడవిలో జరిగింది ప్రసవం
పుత్రుని చూసిన గౌతముని తల్లి పులకించిపొయింది
పుత్రోత్సాహం తొ ఉప్పొంగిపొయింది
పుడమి తల్లి బుద్ధుని జననంతోపరవశించింది
పుణ్య భూమి గా బుద్ధుని ప్రవచనాలతో ప్రశాంతతని సంతరించుకుంది
పుణ్యపురుషుడి జ్ఞనోదయంతో మారణహొమాన్ని మాని మానవాళి లో మానవత్వం ప్రకాశించింది
పునీతుని పొందిన జ్ఞనోదయం రోజుని గురుపౌర్ణమి గా నిర్ణయించడం జరిగింది
పూజించి ఆమహనీయున్ని మనలో జ్ఞానాన్ని పొందడానికి సహకరించమని వెడుకుందాం


No comments:

Post a Comment