Saturday, 9 May 2015

నాన్నమ్మ ముద్దు

అమ్మ ప్రేమ కన్నా మిన్న ప్రేమ నా సొంతం
నాన్నమ్మ గారాల పట్టి నేనే నన్న అమిత గర్వం 
చిన్న తనం అంతా నాన్నమ్మముద్దే 
సంద్రం అంత ప్రేమకు హద్దే లేదు 
ఓడిలోచేరి అల్లరిచేస్తే ఆపే చెయ్యే లేదు
నాన్నమ్మ గోరుముద్దలు మరువలేనేప్పుడు 
నాన్నమ్మను అల్లుకుపోయే హాయే ముద్దు 
నాన్నమ్మ ప్రేమ కేదీ సాటిలేదు 
నన్ను ఒడిలో చేర్చి లాలించే లాలి  ముద్దు 
నన్ను ఊయలూపె జోలపాడే జోల ముద్దు 
నన్ను ముద్దులతో ముంచె ఆ బోసినవ్వు  ముద్దు 
నన్ను గిలిగింతలు పెట్టి నవ్వించే తీరు ముద్దు 
నన్ను బుడి బుడి అడుగులు వేయించే చేయి ముద్దు 
నేను నేలపడితే తన గుండెకు హథుకొను ప్రేమ ముద్దు 
నాతో దొబూచాట ఆడే ఆ సేహం ముద్దు 
నను బుగ్గ గిల్లె అమ్మ ఆట ముద్దు 
నన్ను ఊరంతా తిప్పి నిద్రపుచ్చు తీరు ముద్దు 
నన్ను ముద్దుగా పెంచిన నాన్నమ్మ జ్ఞాపకం ముద్దు 
నిన్ను తలచిన నా కన్నీటికి లేదు హద్దు  

No comments:

Post a Comment