Sunday, 3 May 2015

నా శ్రీవారికి అంకితం


గుండెల్లో మ్రొగే ప్రియ రాగాలు
గున్నమావి కొమ్మల్లో గండు కోయిల గీతాలు
గుప్పెట్లో దాచా కోటి ఉహలు
గువ్వలా ఎగసే కోటి ఆశలు
గుడిగంటలా నా శ్రీ వారి పిలుపులు
నీ గుండియపై వాలే క్షణాలు
గుచ్చిన సంపెంగల సువాసనలు
గుమ్మానికి వేలాడే నీకై నా చూపులు
గుర్తు పట్టేను నామది నీ పాద సవ్వడులు
గుట్టుగా దాచా నీపై నా ప్రేమలు
గుండియలో నా రామ నామాలు
గుసగుసలు చెప్పే మన ప్రణయాలు
గుర్తుకొస్తుంటాయి నిత్యం నీ స్మృతులు
                                           -కళావాణి-













No comments:

Post a Comment