ఆగుమా ఆగుమా అందాల నా అలివేణి
నీ అరవింద నేత్రాల్లో నా నీలి నీడ చూసుకొని
అలఒకగ సాగే నీ నడకల సొంపులా
అటు ఇటు ఉగే నీ నడుము ఓంపులా
ఘల్లు ఘల్లున కలహంసల నడకలతో చేరుకో చెలి
నల్లనల్లని నీ నీలికనుల నను దాచుకో సఖి
అప్సరవై హృదయ సామ్రాజం ఏలేవు
ఆ దివిలోని అప్సరల తలతన్నే అందాలోలికేవు
అలిగిన నీ ముద్దుమోము అరవిరిసిన అబుజము
అధరముల జాలువారు నీ పలుకులు అతి మధురము
అల్లుకు పోయిన నా బాహు బంధాన నిను బంధించనీ
అల్లన నీ అధారాబృతాన్ని మేల్లాన చుంభిచు కొనీ
రా చెలి నిను నా మది కోవెలలో కొలుచుకొనీ
రాగాలా నా విరిబోని స్వరాభిషేకం చేసుకొనీ
-కళావాణి-
No comments:
Post a Comment