Thursday, 31 July 2014

ఉషోదయo


అంబరమంతా అలుముకున్న పసుపు వర్ణ తోలివేలుగులు
ఆప్యాయంగా పలకరించే పక్షుల కిల కిల రవములు
అమ్మ లాంటి ఆకాశం ఒడిలో పసిపాపలా భానుడు
ఆవులించి అప్పుడే కళ్ళు తెరచి పుడమిని చూసాడు
అవని పులకించి పరవశించే
పూలు పులకించి పూచే
గాలి భూపాల రాగం ఆలపించే
ఉషోదయానికి చెట్లన్నీ స్వగతాలు తెలిపే
                                              --కళావాణి---    

1 comment: