Thursday, 31 July 2014

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

Movie : Aadi(ఆది)
Banner : Sri Lakshmi Narasimha Productions
Cast : Jr NTR, Keerthi Chawla
Music : Mani Sharma
Direction : VV Vinayak
Producer : P Nagamani
Release Date : 28th March 2002
Song Lyricist : chandra bose
Singers : Mallikarjun, Sunita 
Song Lyric : nI navvula telladanaanni naagamalli appaDigiMdi ivvaddU ivvaddU 

పల్లవి :

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరవడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ 
నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

చరణం : ౧

నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నా వయసే మొక్కిన నీకైతే అది మాత్రం ఇవ్వచ్చు
నా బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నా కోసం వేచిన నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకై మొక్కే నాకే ఇవ్వచ్చూ...
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరవడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

చరణం : ౨

నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు
నీనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ...
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరవడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నా వాకిట ముగ్గులు నీకైనా దోసిట మల్లెలు నీకే ...
నా పాపిటి వెలుగులు నీకై నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా

No comments:

Post a Comment