Tuesday, 12 June 2018

ఊరు వాడా ఎండల వెడికి తాళలేక ఆకాశం వంక చూస్తోంది వర్షం కొసం
ఊరట కలిగిస్తూ రైతులకోసం కురుస్తొంది తొలకరి వర్షం
ఊగే గాలులు తేలే మేఘాల ప్రేమ తాకిడికి తాళలేక కరిగిపోయి వానైకురుస్తోంది
ఊపిరి సలపనీయక నేలపై కుంబపొతగా వర్షం కురిపిస్తోంది
ఊడి పడుతున్నాయి వాన జాతర సందడికి పిడుగులు
ఊరించి ఉడికించి వానచినుకులు నేలపై కురిపిస్తోంది ముద్దులు
ఊహించని విధంగా నేలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
ఊరేగే దారుల ఉప్పెనై వాగులు వంకలుగా సాగుతోంది

No comments:

Post a Comment