కొయిల తనగొంతు సవరించె ఆలపించె ఆమని గీతం
కొమ్మల్లో ఊరించె మరపించె వినిపించె మధుర స్వరం
చల్లని గాలులు పిల్ల తెమ్మెరలు తొలకరి వర్షం కొసం
చల్లె నేలంతా కల్లాపీ అవనితల్లి కది వాననీటి అభిషేకం
మల్లె మొగలిరేకు సంపెంగ వెదజల్లె సుగంధ పరిమళం
మలయపవనాలు వీచే మారాకు తొడిగె విచ్చేసె వసంతం
తుమ్మెద తారాడె పూల తెమ్మెరలపై తీపి తెనెలకొసం
తన్మయత్వంతో తూలే తేలే తావిమరచిన తామరం

No comments:
Post a Comment