ఓ లలనా నీ లయలు హొయలు ఏమని వర్ణించను
చారడేసి కళ్ళు చక్కదనం ముందు కలువలు మొహం చాటేసాయి
సంపంగి సాటిలేనిదని చాటే చక్కని చెక్కిన నీ ముక్కుని చూసి
దొండపండు దోబుచాడే నీ పెదాల రంగుని చూసి
పారిజాతమే పరవశించే నీ పలువరుసతో తనని పోల్చి చూసి
చంద్రవంక చిన్నబొయే చక్కని నీ మందహసముని గాంచి
చెక్కిలి చమకు చూసి ఆ చుక్కలే వేవేలబోయే
ముఖ కమలము గాంచిన బ్రమరము మకరందమును గ్రోలుటమరచె
సన్నని నీ నడుముకు సరిలేనిదే లేదని సన్నాయి రాగాలు మరచె
కలికీ నీ కరములు గాంచి తామర తూడలు తామర పత్రముల చాటునదాగే
జీరాడు కుచ్చిల్ల చాటుచేరి పారాడు పాదాలు, పద్మాలు సాటి రావే
హంసలు చిన్నబోయే నీ వయ్యరి నడకలకు తాము సాటిరాలేమని
సెలయేరుల సరవేగములు సెలవనే నీ వయసు పరవల్లకు సాటిలేదని
చుక్కలు గగనాన చప్పున మేఘాన్ని చాటుచేసే నీ చెక్కిలి చమకు చూసి
పట్టుకన్నామృదువైన నీ కురులు గాంచి పట్టు పురుగు పట్టు నేయక పారిపోయే
అరుదయిన అద్భుత శిల్పానివే నీవు
అమర శిల్పులు చెక్కిన అపురూప శిలవు నీవు
ప్రాణమున్న శిలవు నీవు నా ప్రేమ దేవతవునీవు
-కళావాణి-

No comments:
Post a Comment