వసంత పౌర్ణిమ వచ్చింది
వన్నెల వెన్నెలలు తేచ్చింది
వయ్యారాల వనితల మనసు దోచింది
వగలమారి చందమామ చూపు గుచ్చినది
విరహాల చందనాలు పేర్చింది
వగలు సెగలు మనసున పూయించింది
వలపు పిలుపుల ప్రేమ పులకరించింది
వెలవెలబోయే నా మనసు మబ్బుల దాగిన నిను చూచి
వెన్నెల వర్షం లో నిలువెల్లా తడిచాను మురిసి మురిపించి
వగలమారి జాణవులే జాబిల్లి
వల్ల నన్న వుండనీవు ప్రేమ జల్లి
వల్లే యని నా మనసు మెల్లగ నిను జేరి
వలచినా వివరించలేను మనసు జారి
వయ్యారి మల్లెల వాసనలు మత్తు జల్లె
వరసైన చందమామ చందనాలు జల్లే
వనమంతా వలచే వన్నెల వలరాజుని చూసి
వసంత శోభలై విరిసే జాబిల్లి వెన్నెలలతో కలిసి
-కళావాణి- .
వన్నెల వెన్నెలలు తేచ్చింది
వయ్యారాల వనితల మనసు దోచింది
వగలమారి చందమామ చూపు గుచ్చినది
విరహాల చందనాలు పేర్చింది
వగలు సెగలు మనసున పూయించింది
వలపు పిలుపుల ప్రేమ పులకరించింది
వెలవెలబోయే నా మనసు మబ్బుల దాగిన నిను చూచి
వెన్నెల వర్షం లో నిలువెల్లా తడిచాను మురిసి మురిపించి
వగలమారి జాణవులే జాబిల్లి
వల్ల నన్న వుండనీవు ప్రేమ జల్లి
వల్లే యని నా మనసు మెల్లగ నిను జేరి
వలచినా వివరించలేను మనసు జారి
వయ్యారి మల్లెల వాసనలు మత్తు జల్లె
వరసైన చందమామ చందనాలు జల్లే
వనమంతా వలచే వన్నెల వలరాజుని చూసి
వసంత శోభలై విరిసే జాబిల్లి వెన్నెలలతో కలిసి
-కళావాణి- .
No comments:
Post a Comment