మబ్బులు కమ్మేస్తున్నాయి చల్లని గాలి మెల్లగా వీస్తోంది
మయూరం మైమరచి నాట్యం ఆడుతోంది
మదిలో మొహనరాగం పలుకుతొంది
మృదుమధుర భావాల నీటిలో ముంచుతోంది
మచ్చిక తో మెచ్చె ప్రకృతి ముచ్చటిస్తోంది
మచ్చుకైనా మచ్చలేని స్వచ్ఛమైన స్వరం కోయిలది
మనసు విని ఆనందాలనదిలో మునకలేస్తోంది
మధురమైన స్వరం కొసం కొయిల మధువునెతాగిందా
మావిచిగురు వగరుకే ఆ అదృష్టం దక్కిందా
మళ్ళీ మళ్ళీ కూస్తుంటే మనసాగదు
మల్లెలు విచ్చె మాసం చిగురులు తొడిగే చైత్రమాసం
మాడ్చె ఎండలను మరిపించే వసంతం సొగసందం
మారాకువెసి వనం వసంతం కోసం పలికె స్వాగతం
మయూరం మైమరచి నాట్యం ఆడుతోంది
మదిలో మొహనరాగం పలుకుతొంది
మృదుమధుర భావాల నీటిలో ముంచుతోంది
మచ్చిక తో మెచ్చె ప్రకృతి ముచ్చటిస్తోంది
మచ్చుకైనా మచ్చలేని స్వచ్ఛమైన స్వరం కోయిలది
మనసు విని ఆనందాలనదిలో మునకలేస్తోంది
మధురమైన స్వరం కొసం కొయిల మధువునెతాగిందా
మావిచిగురు వగరుకే ఆ అదృష్టం దక్కిందా
మళ్ళీ మళ్ళీ కూస్తుంటే మనసాగదు
మల్లెలు విచ్చె మాసం చిగురులు తొడిగే చైత్రమాసం
మాడ్చె ఎండలను మరిపించే వసంతం సొగసందం
మారాకువెసి వనం వసంతం కోసం పలికె స్వాగతం
No comments:
Post a Comment